సన్‌రైజర్స్ పుంజుకుంటుందా?
పంజాబ్ కింగ్స్‌తో కీ ఫైట్
నిలకడలేని ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్
వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న పంజాబ్
ముల్లాన్‌పూర్, ఏప్రిల్ 10 : ఐపీఎల్ 19వ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. శనివారం జరిగే డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతోంది. ముల్లాన్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ భారీస్కోరు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. అయితే హోంగ్రౌండ్‌లో మాత్రం చేతులెత్తేసింది.
లక్నో సూపర్ జెయింట్స్‌పై కీలక బ్యాటర్లు వైఫల్యం కొంపముంచింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , హెడ్ ఫెయిలవగా.. క్లాసెన్, నితీశ్ రెడ్డి ఆదుకున్నారు. వారిద్దరూ ఆదుకోకుంటే ఘోరపరాజయం పాలయ్యేది. టాపార్డర్‌లో నిలకడలేమి మైనస్ గా మారింది. అభిషేక్ కోల్ కతాతో మ్యాచ్‌లో మాత్రమే ఆడగా.. అటు ఇషాన్ కిషన్ కూడా వైఫల్యాల బాట వీడలేదు. నితీశ్ రెడ్డి ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. క్లాసెన్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్ లో అవకాశమిచ్చినా లివింగ్ స్టోన్ అంచనాలు అందుకోలేదు. అనికేత్ వర్మ చివర్లో మెరుపులు మెరిపిస్తుండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.
అటు బౌలింగ్‌లోనూ నిలకడలేమి ఇబ్బంది పెడుతోంది. ముందు నుంచీ ఊహించినట్టుగానే సన్ రైజర్స్ బౌలింగ్ వీక్ గానే ఉంది. ఉనాద్కట్, హర్షల్ పటేల్ తో పాటు నితీష్ రెడ్డిపైనే పేస్ భారం పడింది. ఎహసాన్ మలింగ కూడా రాణిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ ను వారి హోంగ్రౌండ్ లో కట్టడి చేయడం సన్‌రైజర్స్ బౌలర్లకు సవాల్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ మాత్రం మంచి ఫామ్ లో ఉంది. ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు విజయాలను అందుకోగా... మరో మ్యాచ్ వర్షం తో రద్దయింది.
ఆ జట్టు గుజరాత్ , చెన్నై సూపర్ కింగ్స్‌పై ఛేజింగ్ చేసి గెలిచింది. బ్యాటింగ్ లో ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలీ, నేహల్ వధేరా ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యం గా ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. బౌలింగ్ పరంగానూ పంజాబ్ నిలకడగా రాణిస్తోంది. బార్ట్ లెట్, విజయ్ కుమార్ వైశాక్, మార్కో యెన్సన్‌తో పాటు అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ లో రాణిస్తున్నారు. స్పిన్నర్ చాహల్ కీలక సమయా ల్లో వికెట్లు తీస్తుండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ రెండో స్థానంలో ఉండగా.. హైదరాబాద్ ఆరో ప్లేస్‌లో కొనసాగుతోంది.
గత రికార్డులు
ముఖాముఖి రికార్డుల్లో హైదరాబాద్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు 24 సార్లు తలపడితే 17 మ్యాచ్‌లో సన్‌రైజర్స్, 7 మ్యా చ్‌లలో పంజాబ్ విజ యం సాధించాయి.
పిచ్ రిపోర్ట్
ఐపీఎల్ చరిత్రలో బౌలర్లకు అనుకూలించే చాలా తక్కువ పిచ్‌లలో ముల్లాన్‌పూ ర్ ఉంటుంది. పైగా మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం కూడా ఉండదు.
తుది జట్లు అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష దూబే, శివాంగ్ కుమార్, ఉనాద్కట్, హర్షల్ పటేల్
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్(కీపర్), కూపర్ కన్నో లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వధేరా, స్టోయినిస్, యెన్సన్, బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్, చాహల్




