4 March, 2026 | 11:03 AM

గ్రహణాల పట్ల మూఢనమ్మకాలు తొలగాలి

04-03-2026 12:00 AM

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రోడ్లపై అల్పాహారాన్ని స్వీకరించి సభ్యులు

అదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): చంద్ర గ్రహణం సందర్భంగా ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మవద్దంటూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మంగళవారం స్థానిక తెలంగాణతలి ్లచౌక్‌లో గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పారద్రోలేలా వేదిక సభ్యులు చంద్ర గ్రహణా న్ని వీక్షిస్తూ, అల్పాహారం తినడం, నీటిని తాగు తూ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పారదోలెందుకు ప్రయత్నించారు. 

ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ మాట్లాడుతూ...  గ్రహణాల పట్ల ప్రజలలో ఉన్న అపోహలు, మూఢ విశ్వాసాలు తొలిగిం చే ప్రయత్నంగా తమ వంతుగా చేయడమేనని అన్నారు. మనిషి రాకెట్‌లలో దూసుక పోయి అంతరిక్షం, గ్రహాంతర ప్రయాణం చేస్తూ, పరిశోధనలు చేయుచున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఒక వైపు సైన్స్ చదువుతూ  నిత్యజీవి తంలో మాత్రం అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నాతన్నారు.

గ్రహణాలకు కారణాలు స్పష్టం గా తెలిసి కూడా సంకుచితంగా ఆలోచించటం జరుగుతున్నదనీ పేర్కొన్నారు. చంద్ర గ్రహణాన్ని మామూలు కళ్ళతో కూడా వీక్షించవచ్చ న్నారు.  కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షులు దండ నాయక ఉమాకాంత్, జిల్లా గౌరవ అధ్యక్షులు వీరన్న, ఉదారి నారాయణ, జిల్లా నాయ కులు శ్రీధర్ బాబు, బేదోడ్కర్ సంతోష్ కుమా ర్, గంగన్న, మెస్రం రాజు, లింగారెడ్డి, కంటే నర్సయ్య, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.