4 March, 2026 | 12:18 PM

వైభవంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన

04-03-2026 12:00 AM

వెంకటాపూర్, మార్చి 3 (విజయక్రాంతి): మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో మంగళవారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ములుగు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.

బ్బరికాయ కొట్టి అమ్మవారిని ప్రార్థిస్తూ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గ్రామ అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. భక్తుల హారతులు, ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాలతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎడ్ల మురళి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు కామ అశోక్, తెలంగాణ ఉద్యమ నాయకులు కామ కృష్ణమూర్తి, సర్పంచ్ అభ్యర్థి లావుడ్య దేవేందర్, సీనియర్ నాయకులు జాటోత్ రాజ్కుమార్, నర్రావుల అశోక్, ఆగే తిరుపతి, సంతోష్, గుడి పూజారి లావుడ్యా సారయ్య, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.