20 May, 2026 | 2:23 PM

సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత

20-05-2026 01:24 PM

న్యూఢిల్లీ: జనాభా గణనలో కుల గణనను మినహాయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. కులగణనను ఏజెన్సీలు దర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉందని దాఖలైన పిల్ పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, విపుల్ పాంచోలిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

జనాభా గణన కుల ప్రాతిపదికన జరగాలా లేక వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, వెనుకబడిన తరగతులకు చెందినవారు తదితరులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలియాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ అంశం ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తుందని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అనంతరం సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మసనం ఉత్తర్వులో పేర్కొంది.