12 June, 2026 | 12:24 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

19-02-2026 02:03 PM

న్యూఢిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఆర్థిక లోటులో ఉన్నా ఉచిత పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచితాలు అమలు చేస్తున్నాయని వెల్లడించింది. ఉ

చిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ కు బదులు ఉపాధికి కృషి చేయాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని డీఎంకే(DMK) హామీ ఇచ్చింది. డీఎంకే పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు కేంద్రప్రభుత్వానికి(Central Government) నోటీసులు ఇచ్చింది. ఉచిత హామీలు ఇస్తున్న పార్టీల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు భూ యజమానులకు కూడా అందుతున్నాయన్న సుప్రీంకోర్టు అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది.