12 June, 2026 | 1:30 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

ఖర్గే, రాహుల్‌తో ముగిసిన తెలంగాణ నేతల భేటీ

19-02-2026 02:20 PM

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతల సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) నివాసంలో 2 గంటల పాటు భేటీ కొనసాగింది. సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన, సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీ సంస్థాగత బలోపేతం, నామినేటెడ్ పోస్టులపై అధిష్ఠానానికి వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల(Telangana Congress leaders) భేటీపై ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని ఖర్గే తెలిపారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని సూచించారు.