ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోలేదు.. సుప్రీం సీరియస్
25-05-2026 04:00 PM
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష రద్దు చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారం వ్యక్తం చేసింది. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు ఇచ్చిన ఆదేశాల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుణపాఠం నేర్చుకోలేదని మండిపడింది. 2024లో నిపుణుల కమిటీ సిఫార్సులపై ఏం చర్యలు తీసుకున్నారని ఎన్టీఏను ప్రశ్నించిన సుప్రీంకోర్టు నీట్ బలోపేతానికి కమిటీ చేసిన సీఫార్సులపై మూడు రోజుల్లో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. రెండేళ్ల క్రితం కూడా పేపర్ లీక్ పై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఎన్టీఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదని జస్టీస్ పీఎస్ నర్సింహ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఏను మార్చాలంటూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయని, కోర్టుకు వచ్చిన పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఎన్టీఏకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.






