25 May, 2026 | 4:51 PM

AIADMK పార్టీకి బిగ్ షాక్..! ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

25-05-2026 04:19 PM

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu politics) మరో సంచలనం చోటుచేసుకుంది. సీనియర్ నాయకులు సీవీ షణ్ముగం(C.V. Shanmugam), ఎస్.పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలోని ముగ్గురు AIADMK ఎమ్మెల్యేలు(AIADMK rebel MLAs) సోమవారం నాడు తమిళనాడు శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. ఇదే వర్గానికి చెందిన మరో ఐదుగురు పార్టీ అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి వద్దకు తిరిగి వెళ్ళారు.

AIADMK టికెట్లపై పోటీ చేసి విజయం సాధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మధురాంతకం నుండి గెలిచిన మరగాథం కుమారవేల్, ధారాపురం నుండి పి. సత్యభామ, పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎస్. జయకుమార్ సచివాలయంలో స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ధారాపురం (తిరుప్పూర్), పెరుందురై (ఈరోడ్) నియోజకవర్గాలు, పశ్చిమ తమిళనాడులోని AIADMKకు సంప్రదాయ కంచుకోటగా ఉన్న కొంగు ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. 

రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే టీవీకే మంత్రి ఆధవ్ అర్జునను(Minister Adhav Arjuna (TVK)) ఆయన ఛాంబర్‌లో భేటీ అయ్యారు. త్వరలో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(Tamilaga Vettri Kazhagam) పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు బలపరీక్ష సమయంలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. 2026 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే(Vijay TVK Party) పార్టీ 107 స్థానాల్లో విజయం సాధించి సీపీఐ, సీపీఎం, వీసీకే, IUML పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.