12 June, 2026 | 11:50 AM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

హేమంత్ సోరెన్‌పై ఈడీ కేసు: విచారణపై సుప్రీం స్టే

25-02-2026 02:50 PM

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై(Jharkhand CM Hemant Soren) నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారం నిలిపివేసింది. కేసును కొట్టివేయాలని కోరుతూ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు(Enforcement Directorate) నోటీసు జారీ చేసింది. 

సుప్రీంకోర్టులో(Supreme Court) సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ తనకు పదే పదే జారీ చేసిన సమన్లను కూడా సవాలు చేశారు. తనపై ఉన్న కేసును కొట్టివేయడానికి నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు ఇటీవలి నిర్ణయాన్ని సోరెన్ సవాల్ చేశారు. జనవరి 15న, ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు కేసులో ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టు సోరెన్‌పై తీసుకున్న అభియోగాన్ని రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భూ కుంభకోణంలో సోరెన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈడీ సమన్లు ​​జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై ఈడీ ఫిర్యాదు చేసింది.