‘సేవా భారతి’కి శస్త్రచికిత్స పరికరాలు
ఆసుపత్రికి అందించిన ఎన్జెన్ గ్లోబల్
హైదరాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి) : ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఎన్జెన్ గ్లోబల్(Integrated Healthcare Global Capability Center Enzen Global), తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(Corporate Social Responsibility) (సీఎస్‌ఆర్) కార్యక్రమం ఎన్జెన్ గ్లోబల్ సర్వ్(Engen Global Serve) ద్వారా హైదరాబాద్(Hyderabad) సీతారాంబాగ్‌లోని సేవా భారతి ఎల్‌సీహెచ్ గ్రీన్‌ల్యాండ్స్ ట్రస్ట్ - డాక్టర్ ఈశ్వర్ చందర్ ఛారిటబుల్ హాస్పిటల్‌కి అధునాతన ఆర్థోపెడిక్(Advanced Orthopedic), ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స పరికరాలను(Laparoscopic surgical instruments) అందించింది.
ఈ పరికరాలను ఆదివారం సేవా భారతి ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్జెన్ గ్లో బల్ సీహెచ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ అయ్యగారి, ఎన్జెన్ గ్లోబల్ సీఎఫ్‌ఓ, ఎన్జెన్ గ్లోబల్ సర్వ్ - హెడ్ అరవింద్ శ్రీనివాసన్, డైరెక్టర్ అమృతలు సేవా భారతి ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వేద ప్రకాష్ , సేవా భారతి రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు రామమూర్తి ప్రభల, లయన్స్ క్లబ్ ప్రతినిధి విద్యా భూషణ్ సమక్షంలో అందజేశారు.
సేవా భారతి ఆసుపత్రి మెడికల్(Seva Bharati Hospital Medical) డైరెక్టర్ డాక్టర్ వేద ప్రకాశ్ మాట్లాడుతూ ఈ పరికరాల ద్వారా ఆసుపత్రి శస్త్రచికిత్సల సామర్థ్యం మరిం త బలోపేతం కానుంది. ముఖ్యంగా, తక్కువ ఆదాయ వర్గాలు, వైద్య బీమా లేని కుటుంబాలకు నాణ్యమైన శస్త్రచికిత్స సేవలు అం దించేందు కు ఈ పరికరాలు దోహదపడతాయన్నారు.
