15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తిప్పాపూర్ గోశాల ఆకస్మిక తనిఖీ

07-06-2025 01:20 AM

వేములవాడ, జూన్6(విఐకాయక్రాంతి):ఈ నెల 8వ తేదీన ఆదివారం వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో కోడెల ను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలను కలెక్టర్ ఆక స్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గోశాల ఆవరణను పరిశీలించారు.

అనారోగ్యానికి గురైన కోడెలకు అందిస్తున్న చికిత్స పై వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి ప రిస్థితులను స్వయంగా పరిశీలించారు. గోశాల ఆవరణలో పా డైన , నిరుపయోగంగా ఉన్న ఎండు గడ్డి మొత్తం తొలగించాలని అధికారులను ఆదేశించారు. గోశాలలోని పెద్ద కోడెల ద్వా రా గాయాలపాలైన చిన్న కోడెల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రక్తస్రావాన్ని శుభ్రం చేస్తూ అయోడిన్ ఇతర మెడిసిన్లు అందజేయాలని ఆదేశించారు.

క్రిటికల్ కండిషన్ లో ఐదు కోడెలుగోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న 17 కోడెల లో ఐదు జీవాల పరిస్థితి క్రిటికల్ కండిష న్లో ఉన్నాయని పశు వైద్యాధికారులు తెలిపారు. వాటికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  అర్హత కలిగిన రైతు లు ఆన్లైన్లో జిల్లా వ్బుసైట్ గాని ఆఫ్లైన్లో స్థానిక ఎమ్మార్వో, ఆర్డీ వో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు.అర్హులైన ప్రజలు,  రైతులకు మాత్రమే జియో ట్యా గింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు.

అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కార్డ్ మొదలగు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ వ్బుసైట్ https: //rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.జియో ట్యాగింగ్, వ్బుసైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో కోడెలు పక్కదారి  పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. కోడెలను తీ సుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా ప క్కాగా చూసుకోవాలనిసూచించారు.