15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

07-06-2025 01:18 AM

- ప్రభుత్వ పథకాల్లో అనర్హులను ఎంపిక చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణ

- కార్యాలయం ఎదుటబైఠాయింపు, రాస్తారోకో 

చిగురుమామిడి, జూన్ 6(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు ఎంపిక, రాజీవ్ యువశక్తి వికాస్ పథకం ఎంపికలో అధికార పార్టీ నాయకులు, అధికారులు అనర్హులను ఎంపిక చేశారని,  అధికారులు సైతం పారదర్శకంగా ఎంపిక చేయడంలో విఫలమయ్యారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ కా ర్యాలయాన్ని ముట్టడించారు.

వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు వచ్చి అధికారులు కార్యాలయానికి వెళ్లకుండా కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యు వశక్తి వికాస్ పథకం లో అనర్హులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే అధికారులు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువశక్తి పథకం లో మంజూరు చేయడం సరైంది కాదన్నారు. పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన అధికారులే కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలికి తప్పి దాలు చేయడం ను బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నా రు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువశక్తి పథకంలో అనర్హులను గుర్తించి నిజమైన అర్హులకు మంజూరు చేయాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ నాయకులను అధికారులను ఎక్కడికక్కడే ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.

స్త్స్ర చందబోయిన శ్రీనివాస్ పోలీసులను మోహరించి ఆందోళనను ఎంపీడీవో హామీతో విరమింపచేశారు.గ్రామాల్లో కొంద రు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, రాజీవ్ యు వశక్తి వికాసం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకుల చేతివాటం జరుగుతుందని బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, నాయకులు ఆరోపించారు. పార్టీలకతీతంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జిల్లా నాయకులు సాంబారీ కొమురయ్య, మండల నాయకులు పెసరి రాజేశం, బేతి రాజిరెడ్డి, రామోజు కృష్ణమాచారి, ఎండి సర్వర్ పాషా, సందీప్ రెడ్డి, జక్కుల రవీందర్, స న్నీల వెంకటేశం, బెజ్జంకి లక్ష్మణ్, భోయిని శ్రీనివాస్, మిట్టప ల్లి మల్లేశం, కరివేద మహేందర్ రెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి, గీట్ల తిరుపతి రెడ్డి, బుర్ర తిరుపతి, బోయిని శ్రీనివాస్ కత్తుల రమేష్, నాగేలి రాజిరెడ్డి, రావుల వెంకన్న, పిల్లి వేణు, నారాయణ, బిల్లా వెంకటరెడ్డి, సన్నిల మల్లేశం, బోయిని రమేష్, మక్బుల్ పాష, శరబంద రెడ్డి, మహంకాళి కొమురయ్య, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అనర్హుల ఏరివేత నిరంతర ప్రక్రియ.. 

ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువశక్తి వికాస పథకంలో సాధ్యమైనంతవరకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎంపీడీవో బాశం మధుసూదన్ పేర్కొన్నారు. ఒకవేళ కొన్ని గ్రామాలలో ఎక్కడైనా అనర్హులకు మంజూరైతే వారిని తొలగిస్తామన్నారు.  అనర్హుల ఏరివేత కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని,  మరోసారి గ్రామాల వారీగా అర్హులను పరిశీలిస్తామన్నారు.