ప్రభుత్వానికి మున్సిపల్ కమిషనర్ సరెండర్
18-10-2024 01:45 AM
కరీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి): జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను కలెక్టర్ సత్యప్రసాద్ తెలంగాణ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సరెండర్ చేశారు. మున్సిపా లిటీలో పరిపాలనకు సహకరించడం లేదని, తనకు అప్పగించిన పనుల్లో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడని సీడీఎంఏకు రాసిన లేఖలో జిల్లా కలెక్టర్ వివరించారు. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సహకరించకుండా పరిపాలనకు చాలా అసౌక ర్యాన్ని కలిగిస్తున్నారని కలెక్టర్ లేఖలో పేర్కొన్నారు.






