23 August, 2026 | 5:48 PM

సర్‎లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

23-08-2026 04:37 PM

భైంసా (విజయ క్రాంతి): ఎస్ ఐ ఆర్ రెండో విడత ప్రక్రియలో  ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని  ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బిజెపి నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఆదివారం బైంసా పట్టణంలోని  ఎస్ ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో  బిజెపి బిఎల్ఎ 2 కార్యకర్తలచే  ఎస్‎ఐఆర్‎పై రెండో విడత అసెంబ్లీ కార్యాశాల నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియతో  బోగస్ ఓట్లకు ఇక తావుండదని, రెండో విడతలో ఏమైనా అనుమానాలు ఉంటే  అధికారులకు తెలియజేయాలన్నారు. ఒకరికి ఒకచోట మాత్రమే  ఓటు హక్కు కల్పించాలన్న  ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు.

వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు, విదేశీయులు చొరబడి  ఇక్కడ ఉండకుండా చూడడానికి ఎస్. ఐ. ఆర్ ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం ఎస్. ఐ ఆర్  స్టేట్ కో కన్వీనర్ సంజర్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, సర్ జిల్లా ఇన్చార్  రావుల రామ్ నాథ్, ముధోల్  ఎస్. ఐ. ఆర్ ఇన్చార్జి  పైడిపల్లి గంగాధర్,  ఎస్ ఐ ఆర్ రెండో విడత లో చేపట్టాల్సిన  అంశాల ను వివరించారు.. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్  తుమోల్ల దత్తాత్రి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి రవి పాండే, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ తో పాటు మండల బిజెపి అధ్యక్షులు, సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు