23 August, 2026 | 5:21 PM

చివ్వెంల గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

23-08-2026 04:28 PM

చివ్వెంల, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని చివ్వెంల గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. మండల ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి, రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, కో-ఇన్‌చార్జి రామంజి మాదిగ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ వల్దాసు వెంకన్న మాదిగ, గ్రామ సర్పంచ్ ఎర్పుల నాగేష్ మాదిగ, డాక్టర్ ఈదయ్య మాదిగ, హమాలీ మేస్త్రి ఎర్పుల అంబయ్య మాదిగ తదితరుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

అధ్యక్షుడిగా కత్తుల రామకృష్ణ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా బచ్చలి నాగేంద్ర మాదిగ, బుర్రి వంశీ మాదిగ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎర్పుల మధు మాదిగ, కత్తుల ప్రేమ్ మాదిగ, బచ్చలి మనోజ్ మాదిగ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా దేవి మహారాజు మాదిగ, సిరపొంగు శ్రీకాంత్ మాదిగ, బచ్చలి నాగరాజు మాదిగ, బుర్రి వేణు మాదిగ ఎంపికయ్యారు. సహాయ కార్యదర్శులుగా ఎర్ర సాయికుమార్ మాదిగ, సిరపొంగి సోమరాజు మాదిగ, గోగుల రాము మాదిగ, కొండేటి అఖిల్ మాదిగ, సిరపంగు విఖిల్ మాదిగ, సోమపంగి సతీష్ మాదిగ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డాకూర్ మైసయ్య మహారాజు మాదిగ, ఎర్పుల అంబయ్య మాదిగ, వల్దాసు వెంకన్న మాదిగ తదితరులను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మాదిగల హక్కుల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.