13 May, 2026 | 11:16 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే

11-12-2024 07:39 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందన్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో దరఖాస్తుదారుల వివరాలు, భూ సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారుల వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అధికారులు, సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్, హౌసింగ్ డి.ఈ. వేణుగోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.