బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీ సెషన్ ముగిసేవరకు 22 మందిపై వేటు
- మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరుపై సభ్యుల నిరసన
- స్పీకర్ పోడియం వద్ద ఆందోళన
- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
- మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదనతో స్పీకర్ నిర్ణయం
- న్యాయం కోరితే సస్పెండ్ చేస్తారా?
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) నుంచి బుధవారం 22 మంది బీఆర్‌ఎస్ సభ్యులు సస్పెన్షన్(Suspension of BRS members)కు గురయ్యారు. సభలో నిరసనలకు దిగుతూ సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంతో ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad Kumar) ప్రకటించారు. మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) చేసిన ప్రతిపాదన మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన(BRS members protest)కు దిగారు.
ఇటీవల అసెంబ్లీ(Assembly) వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల(BRS women MLAs) పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’అంటూ నినాదా లు చేస్తూ కేటీఆర్ సహా ఇతర బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో వారిని ప్రస్తుతం సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రతిపాదించారు. మంత్రి ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సమావేశా లు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెన్షన్‌కు గురైన వారి లో బీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు, సభ్యులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, కొనికం టి మాణిక్ రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కేపీ వివేకానంద ఉన్నారు. సస్పెన్షన్ అనంతరం కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన కొనసాగింది.
స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం అసెంబ్లీ ఆవరణలోనే నిరీక్షించారు. స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా మార్షల్స్ వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం అసెం బ్లీ ప్రవేశద్వారం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. న్యా యం చేయాలని, మ హిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఘటనకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
స్పీకర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆందోళన కొనసాగించారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ సభ్యులం దరూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లారు. బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌తో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి.
ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోరి తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిని ప్రశ్నించినందుకే సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘వెయ్యి రోజుల వైఫల్య పాలనపై చర్చ పెట్టమంటే సస్పెండ్ చేస్తారా?, ఆడబిడ్డలకు న్యాయం చేయమంటే సస్పెండ్ చేస్తారా?, 22 ఏపై చర్చ పెట్టమంటే సస్పెండ్ చేస్తారా?’ అని మండిపడ్డారు.