26 June, 2026 | 2:10 AM

బంజారాహిల్స్‌లో సువర్ణం జ్యువెల్స్ రెండో షోరూమ్ ప్రారంభం

26-06-2026 01:04 AM

బంజారాహిల్స్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ రెండో షోరూమ్ను నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో సంస్థకు చెందిన ప్రత్యేక బంగారపు డిజైన్ల ఆభరణాలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు సిద్ధాంత్ నహార్ మాట్లాడుతూ రెండో స్టోర్ ప్రారంభం కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే కాదన్నారు. వినియోగదారులు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్లను జోడిస్తూ నాణ్యమైన ఆభరణాలను అందించడమే లక్ష్యంగా సువర్ణం సంస్థ ముందుకు సాగుతోందన్నారు.

ఈ కొత్త షోరూమ్లో బంగారం, వజ్రాలు, పోల్కీ, కుందన్ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం హ్యాండ్క్రాఫ్ట్ శైలిలో రూపొందించిన హారాలు, చోకర్లు, వడ్డాణాలు, గాజులు, చెవిపోగులకు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. వీటితో పాటు ప్రత్యేక వధూవరుల కలెక్షన్లు, పండుగల ఆభరణాలు, వారసత్వ శైలి డిజైన్లు, కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేక ఆర్డర్ జ్యువెలరీ సేవలను కూడా ఈ సరికొత్త షోరూమ్లో అందిస్తున్నట్లు వెల్లడించారు.