జగన్నాధపురం లో"స్వచ్ఛత హీ సేవా."

01-10-2026 | 06:00pm

ములకలపల్లి,అక్టోబర్ 1 (విజయక్రాంతి):ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీలో "స్వచ్ఛత హీ సేవా" కార్యక్రమంలో(Swachhta Hi Seva Program) భాగంగా జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంజా వినోద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,ఇళ్లు, వీధులు,ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో చెత్తను పేరుకుపోకుండా చూడాలని సూచించారు.

“పరిశుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన సమాజం” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది,ప్రజాప్రతినిధులు,యువత, గ్రామస్తులు పాల్గొని స్వచ్ఛత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్,ములకలపల్లి మండల కాంగ్రెస్ బి ఎల్ ఏ కోఆర్డినేటర్ సురభి రాజేష్ బియల్ఏ చేకుర్తి రామాచారి, బ్యాంకు సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు