29 July, 2026 | 4:16 PM

శిథిల భవనంలో తహసీల్దార్ కార్యాలయం

29-07-2026 03:41 PM

కుబీర్,(విజయక్రాంతి): ముధోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న భవనంలో కొనసాగడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ జగన్మోహన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 110 సంవత్సరాల నాటి నిజాం కాలం నాటి భవనంలో ఇప్పటికీ కార్యాలయాన్ని నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రతిరోజూ వందలాది మంది రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ కార్యాలయానికి వస్తున్నారని, ఎప్పుడు కూలిపోతుందో తెలియని భవనంలో ప్రభుత్వ కార్యాలయాన్ని కొనసాగించడం ప్రమాదకరమన్నారు. ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వం కనీస భద్రత కలిగిన కార్యాలయ భవనాన్ని కూడా కల్పించలేకపోవడం పాలనా వైఫల్యమని మండిపడ్డారు. వెంటనే ముధోల్ తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం మంజూరు చేసి, అప్పటి వరకు కార్యాలయాన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి తరలించాలని డిమాండ్ చేశారు.