25 April, 2026 | 10:43 PM

ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

12-08-2024 12:16 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): కంప్యూటర్, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అప్సా, టెక్ మహీం ద్రా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ వాల్‌పోస్టర్‌ను హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదివారం ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. శిక్షణా కేంద్రం మేనేజర్ షేక్ మౌలా మాట్లాడుతూ.. ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీషు, టైపింగ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్, కస్టమర్ రిలేషన్‌షిప్ అండ్ సేల్స్‌పై మూడు నెలల శిక్షణ ఇచ్చి 100 శాతం ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు తెలిపారు.