9 May, 2026 | 4:48 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

ఆన్లైన్ కోచింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

09-09-2025 05:27 PM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

బోయిన్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆన్ లైన్ తరగతులను 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం, ఆన్ లైన్ కోచింగ్ తరగతులను సద్వినియోగపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) అన్నారు. బోయిన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్ లైన్ తరగతులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పిల్లలకు పోటీ పరీక్షల రాసేందుకు ఆన్ లైన్ తరగతుల ద్వారా మంచి శిక్షణ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆన్ లైన్ తరగతుల్లో దేశంలోని నిపుణులైన టీచర్లచే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢీల్లీలో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని మన సిరిసిల్ల జిల్లాలోని పిల్లలకు కూడా అందిస్తున్నామని అన్నారు. ప్రతి రోజు  కనీసం 2 గంటల పాటు ఆన్ లైన్ కోచ్చింగ్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతులు 3 సంవత్సరాలు చాలా కీలక సమయమని, దీనిని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుందని అన్నారు.ముఖ్యమైన పాఠ్యాంశాలలో బేసిక్స్ ఇంటర్ లో ప్రారంభం అవుతాయని అన్నారు. 

విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం కల్పించిన ఆన్ లైన్ తరగతులు  శిక్షణ సౌకర్యం విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఆన్ లైన్ తరగతులలో మన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉందని, ప్రతి విద్యార్థి  తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మాడల్ స్కూల్ లో విద్యార్థులకు ఫ్యాన్లు లేవని తెలుపగ వెంటనే 50 ఫ్యాన్లు మంజూరు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు.సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్ లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చోరువ చూపారని అన్నారు. మోడల్ స్కూల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే  కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తాసిల్దార్ ఎంపీడీవో కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు, స్థానిక నాయకులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.