మా సమస్యలపై మాట్లాడండి
- మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఆర్టీసీ జేఏసీ వినతి
- కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతా
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ఆర్టీసీ జేఏసీ నాయకులు గురువారం మా జీమంత్రి హరీశ్‌రావును, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును, ఎంఐఎం, సీపీఐ నేతలను కలిసి జేఏసీ చైర్మన్ ఈదురు వెంక న్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, నాయకులు ఏఆర్ రెడ్డి, జే.రాఘవులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను వారి దృష్టికి జేఏసీ నాయకులు తీసుకెళ్లారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయమని కోరుతున్నామని, ఇందులో కొత్త డిమాండ్లు లేవని వారన్నారు. ఆర్టీసి సంస్థ ను నిర్వీర్యం చేస్తున్నారని, అందులో భాగంగానే వేలాది ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను బల వంతంగా సంస్థపై నెట్టి, కార్మికుల ఉద్యోగాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నా రు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కార్మిక సమస్యలు కార్మిక సంఘాలతో చర్చించటానికి ముఖ్యమంత్రి ఎందుకు సమ యం ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. తమ సమస్యలపై మాట్లాడాలని వారు కోరా రు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ పేరు తో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు అప్పగించి, వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డా రు. ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా 2 వేల బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పం దం కుదుర్చుకుందని, విద్యుత్ బస్సుల ము సుగులో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుందన్నారు.
జీరో టికెట్ అమలు కోసం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తామ ని చెప్పిన ప్రభుత్వం.. ఇపుడు అరకొర నిధు లు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయమని, గత రెండేళ్లుగా ఈ పథకానికి సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని ఆర్టీసీపైనే మోప డం వల్ల సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా నిలుస్తుందనుకున్న డబ్బు చేతికి రాక కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు.
కార్మికులకు దక్కాల్సిన పదోన్నతులు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. సిబ్బంది కొరతతో ఉన్న కార్మికులపై తీవ్ర పని భారం పడుతోందని, ఆ ఒత్తిడి వల్ల కార్మికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమను చూపించకుండా. తక్షణమే రూ. 2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా పోరాడుతామని స్పష్టం చేశారు.




