13 March, 2026 | 6:53 AM

హెచ్‌సీఏ అవినీతిపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు

13-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీస్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని వెల్లువెత్తిన ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్నది. క్రికెట్ అభివృధి నిధులను కొందరు దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 2004 నుంచి 2026 వరకు హెచ్‌సీఏ నిధులలో దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

ఫిర్యాదులో ప్రస్తుత రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారు ద్దీన్, హెచ్‌సీఏ ఏపెక్స్ కౌన్సిల్ సభ్యులు అ మర్నాథ్, సర్దార్ దల్జీత్ సింగ్, టీ బసవరాజు తదితరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్రికె ట్ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అక్రమంగా వినియోగించారని ఆరో పించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, 2004లో హెచ్ సీఏ స్టేడియం ప్రాజెక్ట్‌లో విశాఖ ఇండస్ట్రీస్‌తో జరిగిన ఒ ప్పందంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

రూ.60 కోట్ల ప్రాజెక్ట్‌లో విశా ఖ ఇండస్ట్రీస్ కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లించిందని, అయినప్పటికీ స్టేడి యం పేరు మార్పు వంటి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో జరిగిన ఆర్బిట్రేషన్ కేసులో రూ.25.92 కోట్ల అవా ర్డు వచ్చినప్పటికీ, ఆ నిర్ణయాన్ని సవాలు చేయకుండా వదిలేయడంతో వడ్డీతో కలిపి భారీ నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పరస్పర లాభాల కోసం కుట్ర జరిగిందని ఆరోపించారు.

న్యా యవ్యవహారాల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసి, క్రికెట్ అభివృద్ధి పనులను నిర్ల క్ష్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీసీసీఐ అనుమతి లేకుండా టోర్నమెంట్లు నిర్వ హించడం, ఆటగాళ్ల ఎంపికలో అవినీతి, ఒక్కో ఆటగాడి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయనీ గుర్తుచేశారు.