13 June, 2026 | 2:41 AM

2010 పూర్వం నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

13-06-2026 01:41 AM

తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రావు డిమాండ్

జగిత్యాల, జూన్ 12 ( విజయక్రాంతి ) : ఏప్రిల్, 2010 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకంఅయిన ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది.ఈ సంద ర్బంగా జిల్లా అధ్యక్షులు బోయినిపెల్లి ప్రసాద్ రావు,ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ లు మాట్లాడుతూ ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం 2025 సెప్టెంబర్ 1న సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు 2028 ఆగస్టు 31 లోపు టెట్ పాస్ కాని సర్వీస్ టీచర్ల సర్వీస్ తొలగించే అవకాశం ఉందని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో దాదాపు 30,000 మంది టీచర్లు దీని ప్రభావానికి లోనవుతారని తెలిపారు2010కి ముందు టెట్ అవసరం లేకుండా నియమితులైన వారిపై ఇప్పుడు టెట్ తప్పనిసరి చేయడం అన్యాయమని, 30 ఏళ్లుగా బోధిస్తున్న టీచర్లకు సంబంధం లేని సబ్జెక్టులు చదవాల్సి వస్తుందని వారు అన్నారు.ఎన్ సీ ఆర్ టీ, ఎస్ సీ ఈ ఆర్ టీ ల ఆధ్వర్యంలో దీక్ష, నిష్ఠ వంటి శిక్షణలు అందిస్తున్నందున టెట్ అవసరం లేదని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి 2010 పూర్వపు నియామకాలకు మినహాయింపు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో బోనగిరి దేవయ్య, సందేల్లి మలహల్ రావు, నాగమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.