ఉద్యోగార్ధులకు.. ఈ క్లాస్ యాప్ ఉపయోగకరం
మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): నిరుద్యోగులు ఉద్యోగ నియామ కాల కోసం సన్నద్ధం అయ్యేవిధంగా బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించి ప్రవేశపెట్టిన ఉచిత ఈ క్లాస్ యాప్ ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించా రు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ యాప్ ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని తెలిపారు. ఉచితంగా యాప్ వినియోగించుకుని స్టడీ మెటీరియల్ ద్వారా నైపుణ్యం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మె ల్యే బానోత్ శంకర్ నాయక్, డిఎస్‌ఎప్‌ఐ జాతీయధ్యక్షుడు డాక్టర్ వివేక్, మహబూబాబాద్ జిల్లాపరిషత్ మాజీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, బిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు యాళ్ళ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






