తెలంగాణ ఉద్యమకారుడు బండి అంజిరెడ్డి
సత్తుపల్లి. అక్టోబర్ 6. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి, సత్తుపల్లి పట్టణంలోని జూపల్లి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బండి అంజిరెడ్డి ని(Telangana activist Bandi Anji Reddy) రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మంగళవారం పరామర్శించారు.
అనారోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, అంజిరెడ్డి ని మెరుగైన వైద్యం అందేలా వైద్యులను సంప్రదించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.