వన్యప్రాణి, అడవుల సంరక్షణ పై అవగాహన

06-10-2026 | 06:04pm

మహాదేవపూర్ (విజయక్రాంతి): 72వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా వన్యప్రాణి సంరక్షణ అడవుల సంరక్షణ(Wildlife Conservation)పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అడవులు వన్యప్రానుల సంరక్షణపై మహాదేవపూర్ ఎఫ్ డి ఓ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాదేవపూర్ ఎఫ్డిఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ వన్యప్రాణుల ఆవాసాలైనా అడవులను కాపాడితే పర్యావరణ సమతుల్యయతతో పాటు వన్యప్రాణులు సంరక్షించబడతాయని ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఒకప్పుడు మహాదేవపూర్ అడవుల్లో పెద్దపులులు చిరుతపూలలుతో పాటు ఇతర జీవాలుఅధికంగా ఉండేవని ప్రస్తుతం మానవులు అడవులల్లో జీవాలను వేటాడడం వల్ల  అవి అంతరించిపోయాయని  అడవులను వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. అనంతరం వన్యప్రాణి సంరక్షణ పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎఫ్ ఆర్ ఓ ఆర్ రవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జె విజయ్ కుమార్, గ్రీన్ వారియర్ చంద్రశేఖర్, డిగ్రీ కళాశాల లెక్చరర్స్ మహాదేవపూర్ డిఆర్ఓ జ్యోతి, ఎఫ్ బిఓ ఆర్ సదానందం, అటవీ శాఖ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు