16 March, 2026 | 3:07 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

16-03-2026 12:26 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు2026(Telangana Assembly Budget Session) ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) ప్రసంగించారు. గవర్నర్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. శ్రమించేతత్వంగల శాంతికాముక తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్ రూపొందించామని తెలిపారు.

ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజాకేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానమని గవర్నర్ శుక్లా వెల్లడించారు. 2047 తెలంగాణ రైజింగ్(Telangana Rising- 2047) దిశగా అడుగులు వేస్తున్నామని సూచించారు. దేశ జీడీపీకి తెలంగాణ 4.99 శాతం అందిస్తోందని ఆయన వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(Ease of Doing Business ) ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపాలని నిర్ణయించామని గవర్నర్(Telangana Governor) స్పష్టం చేశారు.

మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన కోసం మొత్తం 45 ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించామని గవర్నర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని వెల్లడించారు.క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నామని తెలిపారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లగా, హైదరాబాద్ మెట్రోపాలిటిన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లగా విభజించామని సూచించారు.

హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని చెప్పారు. కొడంగల్ ప్రాంతం పారిశ్రామిక వాడగా మారబోతోందన్నారు. 23వ బయోఆసియా సదస్సు ద్వారా రూ. 1700 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు. రూ. 1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో దేశంలో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉందని వెల్లడించారు. సేవారంగం 13.5 శాతం వృద్ధితో రాష్ట్ర జీవీఏకు 68.6 శాతం మేరకు దోహపడుతోందన్నారు. జీసీసీలలో 20 శాతం ఆతిధ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ గా మారిందని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా కొనసాగుతోందని చెప్పారు. 

ఐటీ ఎగుమతులు రూ, 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించామని ఆయన సూచించారు. గతేడాది వానాకాలంలో రైతు భరోసా కింద రూ. 8,744 కోట్లు ఇచ్చామని తెలిపారు. పంట రుణమాఫీ కోసం రూ. 20,616 కోట్లు ఖర్చు చేశామన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. నరేగా ద్వారా 6.52 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా 269 కోట్ల ఉచిత ట్రిప్పులు కల్పించామన్నారు. మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ. 9,222 కోట్ల ఆదా అయిందన్నారు. గృహజ్యోతి ద్వారా రూ. 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశామని స్పష్టం చేశారు. ఎస్ హెచ్ జీలకు రూ. లక్ష కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్లు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ వివరించారు.