ఐహెచ్‌ఆర్‌సీఐ రాజేంద్రనగర్ అధ్యక్షుడిగా వంశీకృష్ణ
హక్కుల ఉల్లంఘన జరిగితే ముందుంటా
బాధ్యతలు స్వీకరించిన నూతన అధ్యక్షుడు
మణికొండ,(విజయక్రాంతి): మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా పోరాడేందుకు తాను ముందుంటానని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా రాజేంద్రనగర్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడు వంగవీటి వంశీకృష్ణ స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, నిరంతరం సామాజిక సేవలో పాలుపంచుకుంటానని ఉద్ఘాటించారు. వంగవీటి వంశీకృష్ణకు రాజేంద్రనగర్ అధ్యక్షుడిగా నియామక పత్రం, గుర్తింపు కార్డును కమిటీ జాతీయ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, జాతీయ కోశాధికారి సరాఫ్ రాజేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వాడకట్టు శ్రీకాంత్ చేతుల మీదుగా అందజేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఈసీ మెంబర్లుగా ఎంపికైన కిషన్, వెంకటరమణకు సైతం జాతీయ నాయకులు నియామక పత్రాలు, ఐడీ కార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ న్యాయ సలహాదారు లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు ఉత్తంకుమార్, కనక లింగం తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వంశీకృష్ణకు పలువురు మిత్రులు ఆత్మీయ అభినందనలు తెలిపారు.




