Telangana Gaddar Film Awards 2025: చిరంజీవికి 'ఎన్టీఆర్ నేషనల్' అవార్డ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం శనివారం 2025 సంవత్సరానికి గద్దర్ చలనచిత్ర అవార్డులను(Telangana Gaddar Film Awards Announced) ప్రకటించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను జ్యూరీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. స్పెషల్ జూరీ అవార్డును తమ్మారెడ్డి భరద్వాజ(Bharadwaja Thammareddy) ప్రకటించారు. మెగస్టార్ చిరంజీవికి 'ఎన్టీఆర్ నేషనల్' అవార్డు వరించింది.
ప్రత్యేక అవార్డులు:
ఎన్టీఆర్ జాతీయ అవార్డు: చిరంజీవి
ఏఎన్ఆర్ అవార్డు: జయసుధ
కాంతారావు అవార్డు: ఆర్. నారాయణ మూర్తి
బీ.ఎన్. రెడ్డి అవార్డు: సింగీతం శ్రీనివాసరావు
పైడి జయరాజ్ అవార్డు: కమలహాసన్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: అశ్వినిదత్
అవార్డు విజేతలు:
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రామ్ భాయ్
రెండవ ఉత్తమ చిత్రం: దండోరా
మూడవ ఉత్తమ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్: లిటిల్ హార్ట్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ మూవీ: మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం: అనగనగా...
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు: సాయిలు( రాజె వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు: శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి: భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్( రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి(కన్నప్ప)
ఉత్తమ హస్య నటుడు : కృష్ణ తేజ(జిగ్రీస్).




