వదలా.. మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్!
టాలీవుడ్ స్టార్ జగపతిబాబు ప్రధాన పాత్ర లో ఆకెళ్ల వీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్నారు. లయ, హృతిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం లో మేకర్స్ ఈ మూవీ నుచి ఫస్ట్‌లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జగపతిబాబు ప్రెజెన్స్ పోస్టర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ఇంటెన్స్ లుక్, కళ్లద్దాల వెనుక కనిపించే కూల్ కాన్ఫిడెన్స్ పాత్రలోని పవర్‌ను సూచిస్తున్నాయి. వెనుక భాగంలో నీలంఎరుపు రంగుల మధ్య విభజించిన అమ్మాయి ముఖం వెనుక ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందనే ఫీలింగ్‌ను కలిగిస్తోంది. లక్ష్మీ భూపాల రచయితగా పనిచేస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: చోటా కే నాయుడు ఐఎస్‌సీ; సంగీతం: కార్తీక్ బీ కొడకండ్ల; సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణ చారి ఎర్రోజు, వీరు గడ్డం; స్టంట్స్: డ్రాగన్ ప్రకాశ్; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; ఆర్ట్: బజ్జా బ్రహ్మయ్య.




