ఇసన్నపల్లిలో తెలంగాణ విమోచన దినోత్సవం
17-09-2026 | 12:10pm
భిక్కనూర్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి(Isannapalli) గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మేకల రాములు, ఉపసర్పంచ్ బొమ్మేగారి రాజమణి, కార్యదర్శి జుమేద ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.