బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

17-09-2026 | 11:27am

ఎర్రుపాలెం సెప్టెంబర్ 17 (విజయక్రాంతి):ఎర్రుపాలెం మండల కేంద్రంలో బిజెపి పార్టీ(BJP party) ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు అనుమోలు సురేష్ ఆధ్వర్యంలో ముందుగా తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మాడపాటి రామచందర్రావు సర్దార్ జమలాపురం కేశవరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం సాయుధ పోరాటం నిర్వహించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు, పుప్పాల చంద్రమౌళి దేవరకొండ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు