పెద్రిపహాడ్ గ్రామ పంచాయతీ ప్రజాపాలన దినోత్సవం

17-09-2026 | 11:33am

మద్దూరు, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి):పెద్రిపహాడ్(Pedripahad) గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి అనసూజ తారాసింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పి. నర్సింహ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వీఓఏలు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు