బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల నందు 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ మేధావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం అనేది ప్రజల ఎన్నో దశబ్దాల కల 2014 జూన్ 2 న అది సాకారమై దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ఎందరో అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. జూన్ 2 క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు అమరవీరుల సుధీర్ఘ పోరాటానికి సాంస్కృతిక గుర్తింపు అని కొనియాడారు. రాష్ట్ర అవతరణ వెనుక ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, ప్రాణ త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ హెడ్మిస్సెస్ స్వర్ణకుమారి అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






