15 April, 2026 | 9:31 AM

ఆంధ్ర త్రిబుల్ ఐటీకి ఎంపికైన తెలంగాణ విద్యార్థిని

25-06-2025 02:59 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు త్రిబుల్ ఐటీ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబాబాద్ జిల్లా కల్వల హై స్కూల్ విద్యార్థిని యాసారపు వెన్నెల సీటు సాధించారు. వెన్నెల 10వ తరగతి లో ఫలితాల్లో 567 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిబుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపు జాబితాలో ఒంగోలు క్యాంపస్ కు ఎంపికైనట్లు హెడ్మాస్టర్ బండారు నరేందర్ తెలిపారు. ప్రాథమిక స్థాయి నుండి పదవ తరగతి వరకు కల్వల పాఠశాలలోనే చదివిన వెన్నెల త్రిబుల్ ఐటీలో సీట్ సాధించినందుకు  హెడ్మాస్టర్,  ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.