15 April, 2026 | 11:08 AM

తూప్రాన్ మండలంలో భారీ వర్షం...

25-06-2025 02:52 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్, వట్టురు ప్రాంతంలో బుధవారం 12 గంటల ప్రాంతంలో భారీ వర్షం నమోదైంది. గత నెల రోజుల నుండి ఎప్పుడు ఇంత భారీ వర్షం నమోదు కాలేదు. ఆరుద్ర కార్తెలో అడుగు పెట్టిన రెండవ రోజు ఇంత భారీ వర్షం నమోదు కావడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లి విరిసింది.