అప్పడే ఎండలు వచ్చాయా..?
28-09-2026 | 12:42pm
తెలంగాణలో వర్షాకాలం ముగియడంతో ఎండల తీవ్ర పెరుగుతుంది. ఎల్నినో(El Niño) ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వెనుదిరగడంతో అక్టోబర్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ వరకు ఉక్కపోత కొనసాగి, ఆ తర్వాత చలి తీవ్రత పెరగొచ్చని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.