దాతల సహకారంతోనే ఆలయాలు అభివృద్ధి
* గరిడేపల్లిలో పాండవుల గుడి వద్ద బోరుకు కొబ్బరికాయ కొట్టిన త్రిపురం అంజన్‌రెడ్డి
గరిడేపల్లి, సెప్టెంబర్ 16, (విజయక్రాంతి): దాతల సహకారంతో దేవాలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి(Mandal Congress Party President Tripuram Anjan Reddy) అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన చెందిన కర్నె అరుణ లక్ష్మీనారాయణ సుమారు రూ.15 వేల ఖర్చుతో పాండవుల గుడి వద్ద బోరు పనులను, అంజన్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెకపోతుల వెంకటమ్మ చందయ్య,వార్డు సభ్యుడు అరుణ, లక్ష్మీనారాయణ, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానుగ ఆనిల్, మత్య్స సహకార సంఘం చైర్మన్ చామకూరి దశరథ గౌడ్, చైర్మన్ ప్రధాన వెంకన్న, డైరెక్టర్ ప్రధాన అమరయ్య,చామకూరి హరీష్,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.