టెన్షన్.. టెన్షన్‌గా లాస్ ఏంజెల్స్
09-06-2025 02:13 AM
- ఉద్రిక్తతలకు దారితీసిన అక్రమవలసదారుల ఏరివేత
- అదుపుతప్పిన శాంతిభద్రతలు
వాషింగ్టన్, జూన్ 8: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలోని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో అక్రమ వలసదారుల ను ఏరివేసేందుకు ఫెడరల్ అధికారులు చేపట్టిన తనిఖీలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. దీంతో నేషనల్ గార్డు బృందాలను లాస్ ఏంజెల్స్‌కు పంపేందుకు అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శ్వేతసౌధం కూడా ప్రకటన విడుదల చేసింది.
హింస ఇలాగే కొనసాగితే కమాండోలను రంగంలోకి దించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. కాగా ట్రంప్ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. అక్రమ వలసదారుల గుర్తింపు వల్లే అక్కడ నిరసనలు చెలరేగాయి. పోలీసులకు, నిరసనకారులకు నడుమ సంఘర్షణ వాతావరణం నెలకొంది.




