16 April, 2026 | 11:27 AM

ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య

09-06-2025 02:15 AM

హిడ్మా స్వగ్రామంలో ఘటన

చర్ల, జూన్ 8 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సొంతూరు పూవర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.

అలా పోలీసులు అదుపులోకి తీసు కున్న వారిలో బొడ్కే రామ అనే గ్రామస్తుడిని ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. సుమారు పది నుంచి పదిహేను మంది మావోయిస్టులు  పదునైన ఆయుధాల సాయంతో హత్య చేశారు. అమాయకుడిని హత్య చేసిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.