calender_icon.png 11 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం..

11-11-2025 10:03:26 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఢిల్లీలో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ తో ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుండి పూసల రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.