calender_icon.png 11 November, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని

11-11-2025 10:06:27 PM

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నోముల వీరభద్రయ్య కుమార్తె నోముల షైనీ ఇటీవల జిల్లా కేంద్రం సూర్యాపేటలోని ఎస్వీ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్జీఎఫ్ క్రీడల విభాగం అండర్-14 అథ్లెటిక్స్ విభాగం (హైజంప్)లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం, మండల విద్యాధికారి బాలునాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 14, 15, 16 తేదీలలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ నందు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల పీడీ లోడంగి సైదులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.