11-11-2025 10:01:22 PM
బోథ్ (విజయక్రాంతి): వన్యప్రాణుల కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు తక్షణమే ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని బోథ్ నేచర్ కన్జర్వేషన్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ కోరారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు సొసైటీ సభ్యులతో కలిసి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ మాట్లాడుతూ వన్యప్రాణుల దాడులలో పంట నష్టపోయిన బాధిత రైతులు నష్ట పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి బాధిత రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని అన్నారు. కొన్నిసార్లు శాఖల మధ్య సమన్వయం లేక నష్ట పరిహారం కోసం బాధిత రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో సొసైటీ ఉపాధ్యక్షుడు దాసరి పురుషోత్తం, కోశాధికారి వెండి పృథ్వి, సభ్యులు అబ్దుల్ రావుఫ్, రమణ గౌడ్ గొడిసెల తదితరులు ఉన్నారు.