24 August, 2026 | 10:25 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

సినీ పరిశ్రమ తీరుపై దిల్ రాజు అసంతృప్తి

15-06-2025 07:15 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Telangana Film Development Corporation Chairman Dil Raju) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమంపై టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల(Telangana Gaddar Film Awards) ప్రదానోత్సవం శనివారం జరిగిన విషయం తెలిసిందే. గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే కార్యక్రమం విజయవంతమైందని, ప్రభుత్వం అందిస్తున్న అవార్డుల కార్యక్రమానికి అందరూ హాజరై అవార్డులను తీసుకొని ఉంటే బాగుండేదని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.

అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదిని అందురూ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి కేటాయించాలని సూచించారు. గద్దర్ అవార్డుల వేడుక(Gaddar Awards Ceremony)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) రెండు గంటల సమయం వెచ్చించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ అవిర్భవించిన ఏడాది నుంచి అవార్డులు కేటాయించాలని పలువురు సూచనలు చేశారని, ఆ మేరకు ఓ కమిటిని ఏర్పాటు చేసి 2014 నుంచి 2023 వరకు ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం కష్టమైన పని అని చెప్పారు.

అందుకే 2024 చిత్రాలకే అవార్డులు ఇవ్వాలన్ని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమం సమయం నాలుగున్నర గంటలు ఉంది. వేడుకకు వచ్చిన ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించి ఇంకా ఎక్కవ సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఉండాలని అడిగారు. పూర్తయ్యే వరకు ఉంటే చాలా హ్యపీ సర్ అని చెప్పితే, ఆయన 2.15 గంటల పాటు అక్కడు ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డులు తీసుకున్నవారంతా ఆనందించారని కొనియాడారు. ఈ పురస్కారాల వేడుక విషయంలో తమకు మార్గనిర్దేశం చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదులు తెలిపారు. 

త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుందని, ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే ఎంత జాగ్రతగా వాటిని స్వీకరించాలని వ్యాఖ్యానించారు. అవార్డు జాబితాలో పేర్లు ఉన్నవారు ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్న రావాలని కోరారు. ఇకపై ప్రభుత్వాల తరపున అవార్డులు ప్రకటిస్తే అందరూ హాజరుకావాలని, ఈ విషయం మీ డైరీల్లో నోట్ చేసుకోని, తమకు వచ్చిన అవార్డు స్వీకరించాలని చిత్ర పరిశ్రమకు ఇది నా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలతో కలిసి ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వాళ్లకు ఉందన్నారు.