12 June, 2026 | 1:31 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

వైభవంగా 14వ అయ్యప్ప పడిపూజ

18-11-2025 12:34 AM

అమీన్ పూర్, నవంబర్ 17 :అయ్యప్పస్వామి 14వ మహాపడి పూజ వైభవంగా జరిగింది. అమీన్ పూర్ పట్టణ పరిధిలో బీరంగూడ మల్లికార్జున హిల్స్లో నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 14వ మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించారు. కన్నె స్వామి నందారం భరత్ గౌడ్, సందీప్ గౌడ్ సాన్నిధ్యంలో వేదపండితుల మం త్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయ్యప్ప భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి గంగాపుత్ర నర్సింగ్ రావు వారి బృందం ఆలపించిన భక్తిరస గానాలు భక్తులను మైమరిపించాయి. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప మాలాధారణ దీక్షతో హృదయం పవిత్రంగా మారుతుందని, మానవ జీవన విధానం భక్తి మా ర్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలు పా ర్టీల రాజకీయ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు, అయ్యప్ప స్వామిలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.