12 June, 2026 | 2:34 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ప్రజావాణికి 62 దరఖాస్తులు

18-11-2025 12:34 AM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,నవంబరు17(విజయక్రాంతి):సమస్య పరిష్కరించాలని, ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి .ఎస్. ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం ఎండార్స్మెంట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 62దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

భూ సమస్యలు 17,గృహ నిర్మాణ శాఖకు 12,పెన్షన్ 05,ఉపాధి కల్పనకు 01, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 27 దరఖాస్తుల వచ్చాయి. సమస్యలను విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన.

62 మంది దరఖాస్తుదారులతో కలెక్టర్, మీ సమస్య చెప్పండని అడిగి తెలుసుకుని దరఖాస్తు పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని, అవసరమైతే ఫీల్ పరిశీలనలు కూడా చేయాలని సూచించారు.