20 July, 2026 | 11:50 AM

అందుకే గద్దర్ ఈ సినిమా చేశారు

26-11-2024 11:41 PM

విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ విషయాన్ని దర్శకనిర్మాత, హీరో సత్యరెడ్డి వెల్లడించారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్‌ను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి గద్దర్ కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదనేది గద్దర్ అన్న ఉద్దేశం.

తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసినవాళ్ల కోసమే గద్దర్  ఈ సినిమా చేశారు. ఆయన ఈ సినిమాలో నటించినట్టు లేదు, జీవించినట్టు ఉంది” అన్నారు. సత్యరెడ్డి మాట్లాడుతూ.. ‘ఆయన ఇందులో మూడు పాటలు పాడి రెండు పాటలతోపాటు కొన్ని సందేశాత్మక సన్నివేశాల్లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించారు. వెన్నెల గద్దర్ అతిథి పాత్రలో కనిపిస్తారు” అని తెలిపారు. సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.