కిక్కిచ్చే టచ్ ఇస్తావా
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్-గా ‘వన్ మోర్ టైమ్’ను రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ప్రేమకోసం తన గర్ల్‌ఫ్రెండ్‌తో మరో అవకాశం కోరే హీరో గురించిన సాంగ్ ఇది. ‘లుక్కిస్తే చాలే జాన్.. లక్కీగా ఫీలవుతా.. కిక్కిచ్చే టచ్ ఇస్తావా.. వన్ మోర్ టైమ్ వన్ మోర్ టైమ్...’ అంటూ
ఎలక్ట్రోపాప్ జానర్‌లో హస్కీ ఇంగ్లీష్ కోరస్‌తో ఈ గీతం ప్రారంభమైంది. జీవీ ప్రకాశ్‌కుమార్, పాప్ సింగర్ విద్యా వోక్స్ తనదైన గాత్రంతో అలరించారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.






